విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలి: సిపిఎం

85చూసినవారు
విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలి: సిపిఎం
విద్యుత్ సర్దుబాటు చార్జీల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ బుధవారం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో వివిధ రూపాలలో మోపిన విద్యుత్ భారాలను తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సర్దుబాటు చార్జీలను పెంచాలని నిర్ణయించడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్