ఏపీలో గురువారం నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4.27 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మెగా డీఎస్సీకి ముందే ఏపీ ప్రభుత్వం టెట్ నిర్వహిస్తుంది. ప్రతి రోజు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు.. మద్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. టెట్ పరీక్షల కోసం 108 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు.