మహాత్మా గాంధీ ప్రజలకు శాంతి, అహింస మార్గంలో పయనించాలని సూచించారని అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ బుధవారం పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఓబులమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.