అనంతపురం నగర సమస్యలపై నాయకులు దృష్టి పెట్టాలి: పోతుల
అనంతపురం నగర సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ. నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా నగరంలో రహదారి విస్తరణ పనులను కూడా చేపట్టాలని కోరారు.