ఉమ్మడి జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

78చూసినవారు
ఉమ్మడి జిల్లా  రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పంటలు చేతికందే పరిస్థితి లేదని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. మంగళవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఏడాది, ఈ ఏడాది కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్