విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. విద్యార్థి సంఘం నాయకుడు పరమేశ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.