ముప్పులకుంట గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తా - ఇద్దరి మృతి
బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ముప్పలకుంటకు చెందిన వన్నూరుస్వామి, లక్ష్మీకాంత్ మృతి చెందారు. పొలం పనులకు వెళ్లిన యువకులు భారీ వర్షం రావడంతో ఆలస్యంగా ఇంటికి పయనమయ్యారు. మార్గ మధ్యలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా యువకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.