పోతంగల్: ట్రాన్స్‌ఫార్మర్ లో కాపర్, ఆయిల్ చోరీ

72చూసినవారు
పోతంగల్: ట్రాన్స్‌ఫార్మర్ లో కాపర్, ఆయిల్ చోరీ
బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలంలోని జల్లాపల్లి-లింగాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పంపుసెట్ల వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లో కాపర్, ఆయిల్ చోరీకి గురైంది. లింగాపూర్లో 37/25, జల్లాపల్లిలో 45/25 కేవీ ట్రాన్స్ ఫార్మర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి కాపర్ వైర్, ఆయిలు చోరీ చేశారు. స్థానికులు గమనించి ట్రాన్స్ కో అధికారులకు సమాచారం అందించారు. ఏఈ నర్సారెడ్డి పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్