నాయనపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
బుక్కరాయసముద్రం మండలం నాయనపల్లి గ్రామానికి చెందిన సాలన్న అనే వ్యక్తి ఇంట్లో బుధవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీరువాలో ఉన్న రూ.1.70లక్షలు కాలి బూడిద అయ్యాయని అన్నారు. అలాగే ఇంట్లో ఉన్న విలువైన ఎలక్ట్రికల్ వస్తువులు కూడా కాలిపోయాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.