ధర్మవరం లోనికోటకు చెందిన బాబా ఫక్రుద్దీన్ (26) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక గోరీల వద్ద మంగళవారం అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అటువైపు ప్రయాణిస్తున్న వారు గమనించి బాబా ఫక్రుద్దీన్ ను చికిత్సకోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చి చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.