ధర్మవరం వ్యవసాయ డివిజన్ పరిధిలోని 6 మండలాల రైతు సేవా కేంద్రాల సిబ్బందికి సామర్థ్యం పెంపుపై బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి వైవీ సుబ్బారావు మాట్లాడుతూ. వివిధ పంటలలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వివిధ పంటలలో చీడపీడల నివారణ చర్యలు, ఎన్పీఎస్ఎస్, సీఎల్ఎస్ యాప్ గురించి శిక్షణ ఇచ్చారు. మామిడిలో పూతకు యాజమాన్య పద్ధతులను, వివిధ పథకాలు వివరించారు.