తిరుపతిలో అన్నమయ్య సర్కిల్ వద్ద శ్రీ అన్నమాచార్య విగ్రహానికి క్రైస్తవ మతానికి చెందిన శాంటా క్లాస్ టోపీని పెట్టి స్వామివారిని అవహేళన చేయడం మంచిది కాదని కలవల రామ్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. ధర్మవరంలో బుధవారం ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహా భక్తుడు పద కవితా పితామహుడు శ్రీ అన్నమాచార్యుల వారిని ఈ విధంగా అవమానించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడం మంచిది కాదన్నారు.