ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని ధర్మవరం ఎంపీడీవో సాయి మనోహర్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ప్రోగ్రాంకు నిరుద్యోగులు 21 నుంచి 24 సం. లోపు ఉండాలని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ఈ నెల 21వ తేదీతో ముగుస్తుందని చెప్పారు.