బుక్కరాయసముద్రంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో రూరల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. ధర్మవరం అండర్-16 అమ్మాయిల జట్టు, బుక్కరాయసముద్రం అండర్-16 జట్టు ఆదివారం తలబడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ధర్మవరం జట్టు 25 ఓవర్లలో 337/3 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బుక్కరాయసముద్రం జట్టు 38 పరుగులకు ఆలౌట్ అయిందన్నారు. ధర్మవరం జట్టులోని హస్మిత 169(71), తేజు దీపిక 108(49) పరుగులు చేశారు.