ధర్మవరం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ సాయం మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా అందించాలని తెలిపారు. డ్వాక్రా సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గిరక రమాదేవి పాల్గొన్నారు.