ధర్మవరం సీఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి హత్యకు గురైన నేపథ్యంలో ఆయనను బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. ఈ ఘటన తనకు చాలా బాధ కల్గించిందని, నమ్మిన వారే ఇలా చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ ఘటన నుంచి త్వరగా కోలుకుని, తిరిగి విధుల్లో బీజీ కావాలని సీఐకి ధైర్యం చెప్పారు. పరిటాల సునీతతో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ చౌదరి ఉన్నారు.