ధర్మవరం లోని సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు శివప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా ఖైదీల బ్యారక్లను ఆయన పరిశీలించారు. అనంతరం వంటగదిని పరిశీలించి ఖైదీలకు మౌలిక సదుపాయాలు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో ముఖాముఖి మాట్లాడుతూ ఖైదీలకు ప్రభుత్వం లాయర్లను ఉచితంగా ఏర్పాటు చేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.