ధర్మవరంలో కూరగాయల మార్కెట్ వద్ద అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ ను సీఐ నాగేంద్రప్రసాద్ క్రమబద్ధీకరించారు. మార్కెట్ కు వచ్చే ద్విచక్రవాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తుండడంతో ఆటోలు, బస్సులు గ్రామాల వైపు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సీఐతో సమస్య పరిష్కరించారు. ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తే అపరాధ రుసుముతో పాటు సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు.