ఉరేసుకుని యువతి ఆత్మహత్య

1050చూసినవారు
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
గుంతకల్లు మండలం దంచర్ల గ్రామానికి చెందిన రేణుక (20) అను యువతి ఇంటిలోని సీలింగ్ హుక్కుకు ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు మృతురాలు కొన్ని సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతుందన్నారు. తల్లిదండ్రులు అనేకచోట్ల వైద్యం చేయించినా నయం కాలేదన్నారు. దీంతో శుక్రవారం రాత్రి ఇంటిలో అందరూ నిద్రిస్తుండగా ఉరేసుకుని మృతి చెందిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్