గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 17, 18వ వార్డుల్లో జరుగుతున్న వాటర్ పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తు పనులను సోమవారం మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా పరిశీలించారు. జేసీబీల సహాయంతో వాటర్ పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తు పనులను చేయిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వాటర్ పైప్ లైన్ లీకేజీ మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక వాటర్ వర్కర్స్ ను ఆదేశించారు.