పామిడి పట్టణంలో శుక్రవారం సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో చేపట్టిన బ్యూటీషియన్ శిక్షణ కేంద్రాన్ని టీడీపీ ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సిడిపిఓ ఢిల్లీశ్వరి, గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ బ్యూటీషియన్ శిక్షణా కేంద్రాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.