గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని కోటవీధిలో డ్రైనేజీ కాలువపై అక్రమంగా నిర్మించిన ఇంటిని బుధవారం మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. డ్రైనేజీ కాలువపై నిర్మించిన ఇంటిని JCB సాయంతో కూల్చివేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, మున్సిపల్ ప్లానింగ్ అధికారులు మాట్లాడారు. అక్రమంగా నిర్మాణాలు చేస్తే కచ్చితంగా కూల్చివేయడంతోపాటు, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.