ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన, స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పెనుగొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కే పార్థసారధి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకుందాం, రోడ్డుపైన అనవసరంగా చెత్త వేసి మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకోవడం మంచిది కాదు అన్నారు.