హిందూపురం: పాఠశాలలకు రూ. 2,01,116 చెక్కు అందించిన ఎమ్మేల్యే

84చూసినవారు
హిందూపురం: పాఠశాలలకు రూ. 2,01,116 చెక్కు అందించిన ఎమ్మేల్యే
హిందూపూర్ జోన్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి అన్నా కాంటీన్ నిర్వహణార్థం రూ. 2,01,116/- (రెండు లక్షల వెయ్యి నూట పదహారు రూపాయల) చెక్కును హిందూపూర్ శాసనసభ్యులు బాలకృష్ణ మంగళవారం అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పాఠశాలల యజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జోన్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి రియాజ్, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్