హిందూపురం: ప్రజల దాహార్తి తీర్చిన జనసేన కన్వీనర్

73చూసినవారు
చిలమత్తూరు పంచాయతీ పాతచామలపల్లి గ్రామంలో తాగునీటి బోరు ఇటీవల కురిసిన వర్షానికి బోరు చెరువులో మునిగిపోయింది. గత కొన్ని రోజులుగా ప్రజలు తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను జనసేన పార్టీ కన్వీనర్ చిన్న ప్రవీణ్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి పంచాయితీ అధికారులతో మాట్లాడి కూటమి ప్రభుత్వం సహకారంతో శుక్రవారం తిరిగి బోర్ వేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్