కదిరి మండల ఎస్ఐ నరసింహుడు పాత నేరస్థులు, రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. మట్క, జూదం, అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలలో అల్లర్లు, గొడవలు, సమస్యలు సృష్టిస్తే కేసులు తప్పవన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవితాన్ని గడపాలని తెలిపారు.