కదిరి పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను శుక్రవారం బలిజ సంఘం, రాయల్స్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాయల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు సుపరిపాలన అందించారని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకృష్ణదేవరాయల జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు.