ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

52చూసినవారు
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే
ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కదిరి పట్టణంలో ప్రైవేట్ యాజమాన్యాల సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. శ్రీసత్యసాయి జిల్లాకు నూతనంగా కమిటీని ఏర్పాటు చేసిన సందర్భంగా కదిరి డివిజన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం కే డి పి ఎస్ ఏ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్