కళ్యాణదుర్గం కోటవీధిలో వెలసిన శ్రీ పట్టాభి రామస్వామి రథోత్సవాన్ని ఫిబ్రవరి మాసంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ దేవినేని అవినాశ్ పర్యవేక్షణలో వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించేందుకు నూతన రథాన్ని సిద్ధం చేస్తున్నారని గురువారం ఆలయ కమిటీ వారు తెలిపారు. నంద్యాల నుంచి ప్రత్యేక కలపను తీసుకువచ్చి కొత్త రథాన్ని రథసప్తమి వేళకు కొత్త రంగులతో సిద్ధమవుతోంది.