కళ్యాణదుర్గం శెట్టూరు రోడ్డులో 30 సంవత్సరాలుగా జనావాసాల మధ్య సుమారు 30టన్నుల చెత్త పేరుకు పోయి ప్రజలకు తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు స్పందించి చెత్త శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం ఈ యంత్రం చెత్తను ఎరువు, ప్లాస్టిక్ వ్యర్థాలు, గులకరాళ్లు వేరువేరుగా విభజించి చెత్తను శుద్ధి చేస్తోంది. 30సంవత్సరాల సమస్యకు పరిష్కారం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు