కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామిరెడ్డి తాగునీటి కార్మికులు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. నేటితో కార్మికుల సమ్మె మూడో రోజు చేరుకోగా, వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు ఆగవన్నారు.