కళ్యాణదుర్గం: ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయం

77చూసినవారు
కళ్యాణదుర్గం: ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయం
బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామం నందు కళ్యాణదుర్గం ఆర్డీవో జి. వసంతబాబు ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ తమ సమస్యలను తెలియజేస్తూ, వాటి పరిస్కారం దిశగా కార్యక్రమంను సక్రమంగా వినియోగించుకోవాలని ఆర్డిఓ తెలియజేశారు. ప్రజల నుండి భూ, ఇతర సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది. ప్రజల నుండి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను అదేశించారు.

సంబంధిత పోస్ట్