కళ్యాణదుర్గం: వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

80చూసినవారు
కళ్యాణదుర్గం: వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజా వేదికలో మంగళవారం రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజాకవి వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేయించడంతో పాటు రెడ్డి కమిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యే సురేంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణ రెడ్డి, తిమ్మారెడ్డి, మంజునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్