కుందుర్పి మండలం ఎనుములదొడ్డి సమీపంలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటస్వామి గురువారం తెలిపారు. ఎనుముల దొడ్డికి చెందిన ఖాసీం ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.