మడకశిర పట్టణంలో శనివారం నట సార్వభౌములు నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించిన మడకశిర టీడీపీపార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెచప్పుడు, రెండు రూపాయలకే కిలో బియ్యం పేద ప్రజలకు పంపిణీ చేసిన మహోన్నత వ్యక్తి, నందమూరి తారక రామారావు అని కొనియాడారు. అనంతరం పట్టణంలో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.