శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం నియోజకవర్గంలోని వైద్యులు, వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు మంత్రి సూచించారు.