అధైర్యపడకండి మీ అందరికీ అండగా నేనున్నా అని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. మంగళవారం సోమందేపల్లి మండలం తుంగోడులో పంచాయితీ స్ధాయి కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్ధాయిలో బలోపేతంకు జిల్లా వ్యాప్తంగా త్వరలో నూతన గ్రామస్ధాయి కమీటీలు వేస్తాం అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.