భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ మండల కమిటీ అధ్యక్షులు ముద్దల వెంకటరమణప్ప డిమాండ్ చేశారు. మంగళవారం గోరంట్ల పట్టణంలోని తహసీల్దార్ మారుతీ కి డిమాండ్ల తో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.