అమరావతి రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో చేనేత జౌళి శాఖాధికారులతో సోమవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులు, పరిశ్రమలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో మంత్రి సవితమ్మ చర్చించారు. అదేవిధంగా సచివాలయంలో చేనేత, జౌళి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో మంత్రి సవితమ్మ అధికారులు పాల్గొన్నారు.