టీవీ చానెల్స్‌‌కు సమాచార మంత్రిత్వశాఖ కీలక సూచనలు

1343చూసినవారు
టీవీ చానెల్స్‌‌కు సమాచార మంత్రిత్వశాఖ కీలక సూచనలు
ప్రైవేట్ టీవీ చానెల్స్‌కు సమాచార మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్ కింద ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్‌కు ఈ క్రింది సూచనలు చేసింది. దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా ప్రోగ్రామ్స్ ఉండకూడదు. అందుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయకూడదు. ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించపర్చేలా ఉన్న వీడియోలు గానీ.. పదాలను గానీ టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్లే చేయకూడదు.వ్యక్తుల ప్రాథమిక హక్కులకు ఆయా వ్యక్తుల భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటనలో నిశితంగా పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్