భూమి చదును కార్యక్రమాన్ని అడ్డుకున్న.. భూ యజమానులు

2311చూసినవారు
భూమి చదును కార్యక్రమాన్ని అడ్డుకున్న.. భూ యజమానులు
సోమందేపల్లి సమీపంలోని సర్వే నెంబర్ 744 భూమి విషయం కోర్టుకు వెళ్ళిందని పనులు తక్షణమే ఆపాలని మంగళవారం భూ యజమానులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డూ ప్రాసేస్ ఆఫ్ లా ప్రకారం నడుచుకోవాలని, కోర్టులో కేసుంటే మేమేమి మాట్లాడమని, రివిన్యూ వారిని రక్షణ అడిగి విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీహరి సమస్య కొలిక్కి వచ్చే వరకు ఎవరు ధర్నాలు చేయవద్దనీ భూ యజమానులను, సిపిఐ నాయకులకు తెలిపారు. ఈ మేరకు సోమందేపల్లి మణికంఠ కాలనీ దగ్గర అర్హులకు ఇళ్ల పట్టాలు మంజూరు కోసం 14 ఎకరాల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దానిని చదును చేస్తుంది. ఈ విషయంలో ఆ భూమికి సంబంధించిన రైతులు దాదాపు 14 రోజులుగా వివిధ రకాలుగా ధర్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రెవిన్యూ వారు మాత్రం చదును చేసే కార్యక్రమాన్ని పోలీసుల రక్షణలో నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే ఉన్నారు. భూ యజమానులు మాత్రం ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కావున పోలీసుల మధ్య యాజమానులు మధ్య రోజుకి రోజుకి ఉద్రిక్తత నెలకొనడంతో గ్రామంలోని ప్రజలు చివరికి ఎమౌతుందోనని ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్