మహిళలను రక్షించుటలో కూటమి ప్రభుత్వం పూర్తీగ విఫలమైందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. గురువారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ మంత్రి సవిత కనుసనల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు చట్టం పరిధిలో ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తాం అన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఈ అంశంపై సుదీర్ఘ పోరాటం చేస్తాం అని తెలిపారు.