నంద్యాల జిల్లా బనగానపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ ధనలక్ష్మి సోమవారం పెనుకొండ పట్టణంలోని హిందూపురం పార్లమెంటు సభ్యులు కార్యాలయంలో బి కే పార్థసారథిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు అయిన బి కే పార్థసారథి కి ఆంధ్రప్రదేశ్ లోని కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.