సమిష్టిగా ఐకమత్యంతో ఉంటే గెలుపు తథ్యం:మాలగుండ్ల

1376చూసినవారు
సమిష్టిగా ఐకమత్యంతో ఉంటే గెలుపు తథ్యం:మాలగుండ్ల
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో సాధించేలా కృషి చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు మాలగూండ్ల శంకరనారాయణ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురంలోని సెవెన్ హీల్స్ ఫంక్షన్ హాల్, గుత్తి రోడ్ లో అనంతపురం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.అనంతరం మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని, మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పూర్తి ఆధిపత్యం సాదించేందుకు చేయవలసిన కార్యచరణ గూర్చి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడిన గత ఏడు నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన, అమ్మ బడి, మనబడి, నాడు-నేడు, వైయస్సార్ నేతన్న నేస్తం, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, వైయస్సార్ పింఛన్ పథకం, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైయస్సార్ వాహన మిత్ర, ఆశా వర్కర్లకు యానిమేటర్లకు జీతభత్యాలు పెంపు, అగ్రిగోల్డ్ బాధితులకు పదివేల రూపాయల డిపాజిటర్లకు ఆర్థిక సహాయం వంటి ప్రతీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా, విరివిగా తీసుకుని వెళ్లి పార్టీ విజయానికి దోహదపడాలని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు సూచించారు. చిన్న చిన్న పొరపాట్లను, లోటుపాట్లను సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఒకే కుటుంబంలా ఐకమత్యంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. స్థానిక సంస్థల్లో పోటీకి ఎంపికైన వారికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు దన్నుగా నిలిచి వారి విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాగా పని చేయాలని, పార్టీ అధికారంలో వుంటేనే పార్టీ ఆశయాలను సాధించవచ్చని తెలిపారు. వైఎస్సార్సీపి సత్యాన్ని రానున్న స్థానిక ఎన్నికల్లో చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్