శ్రీసత్యసాయి జిల్లాకు శనివారంఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కే. కన్నబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన క్లెయిమ్ల పరిష్కారం పక్కగా జరగాలని, జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి రికార్డులన్నీఅందుబాటులో ఉంచుకోవాలన్నారు. రాజకీయ పార్టీల నుంచి అందిన అభ్యంతరాలు, ఓట్ల తొలగింపునకు అందిన క్లెయిమ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతనే పరిష్కరించాలన్నారు.