పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం సిహెచ్ఓ నగేష్ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే రోగాలు భారీ న పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి రోజు కాచిన నీరు తాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, అనురాధ, ఆశవర్క్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.