పుట్టపర్తి రూరల్ శివారు ప్రాంతాల్లో నిర్మానుషమైన ప్రదేశాలపై బుధవారం రూరల్ ఎస్సై లింగన్న, సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగించారు. బహిరంగంగా మద్యం సేవించడం గ్యాంబ్లింగ్, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి వినియోగించిన వారిపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిగా పెట్టే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న శ్రీకారం చుట్టారు.