పుట్టపర్తి: సొంత నిధులతో రహదారి వేయించిన టీడీపీ కార్యదర్శి

64చూసినవారు
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని వడ్డీవంక సమీపంలో ఉన్న రహదారికి ఇరువైపులా ముళ్ళపొదలు పెరిగి రాత్రి వేళ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ సమస్యపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి ని గమనించిన టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదివారం తనసొంత నిధులతో జెసిబి యంత్రాంగం సహాయంతో ముళ్ళ పొదలను తొలగించి గుంతల మయంగా ఉన్న రహదారిని సరిచేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు టిడిపి కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్