ప్రభుత్వ బాలికల వసతి గృహంలోకి వర్షపు నీరు

83చూసినవారు
పుట్టపర్తిలో ఆదివారం ఉదయం 3గంటలు పాటు భారీగా కురిసిన వర్షానికి హనుమాన్ సర్కిల్ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహంలోకి వర్షపు నీరు రావడంతో వసతి గృహం వర్షపు నీటిలో మునిగిపోతుంది. హాస్టల్ లో ఉన్నటు వంటి ఆడపిల్లలు భయానికి గురవుతున్నారు. హాస్టల్ లోకి వచ్చిన నీటిని బయటకి తోసేస్తున్నారు. చిన్నపాటి వర్షానికి మా పరిస్థితి ఇలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్