సత్యసాయిజిల్లాను మాన్యువల్ స్కావేంజింగ్ ఫ్రీ జిల్లాగా ఎంపిక

50చూసినవారు
సత్యసాయిజిల్లాను మాన్యువల్ స్కావేంజింగ్ ఫ్రీ జిల్లాగా ఎంపిక
శ్రీ సత్య సాయి జిల్లాను మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారని మంగళవారం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో మ్యానువల్ స్కావెంజర్లు, ఇన్- సానిటరీ లెట్రిన్లు లేవని జిల్లా పంచాయతీ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల నుంచి నివేదికలు అందాయన్నారు. దీంతో సత్యసాయి జిల్లాను మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించారన్నారు.

సంబంధిత పోస్ట్